ఇసుకపై ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌…జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం..!

ఇసుకకు సంబంధించి జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంటోంది. ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకున్న తరువాత.. నాణ్యమైనది సరఫరా అవ్వకపోతే దాన్ని వెనక్కి పంపే అవకాశాన్ని కొనుగోలుదారులకు ఇవ్వనున్నారు. అలాగే మళ్లీ వారికి నాణ్యమైన ఇసుక అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఏపీఎండీసీ ప్రతిపాదన సిద్ధం చేస్తుండగా.. దీనిపై ఏపీ ప్రభుత్వం త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది. కాగా ఇంటికి డెలివరీ చేసిన ఇసుక నాణ్యత లేదని, మట్టితో వస్తోందని పలువురి నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఇసుక నిర్మాణాలకు ఉపయోగపడం లేదంటూ.. చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పినిపే విశ్వరూప్‌కి సైతం ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై ఆయన కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. ఇక మరోవైపు కొన్ని నెలల కిందట జరిగిన ఇసుక తవ్వకాల లెక్కల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రిపోర్ట్‌ను ఏపీఎండీసీకి అందజేశారు. ఈ లెక్కలపై మరోసారి డ్రోన్ ద్వారా సర్వే చేయించాలని ఏపీఎండీసీ నిర్ణయించింది.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

లక్ష దాటిన కరోనా కేసులు...

Mon Jul 27 , 2020
Post Views: 84 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ఏ రోజుకారోజు రికార్డులను కరోనా అధిగమిస్తూ వస్తోంది. సోమవారం నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తర్వాత లక్ష కేసులు నమోదు చేసిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. ఈ రోజు 43,127 మందికి కరోనా టెస్టులు […]
November 2020
M T W T F S S
« Jul    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30