కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా వైద్య పరీక్షల నిర్వహణపై ఏపీ భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాపిడ్ ఆంటీజన్ టెస్టులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది. ఐసీఎంఆర్ అనుమతించిన ల్యాబ్‌లలో కోవిడ్ టెస్టులు జరపాలని, ర్యాపిడ్ ఆంటీజన్ టెస్టుకి రూ.750 మించి వసూలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఆ నమూనాని విఆర్డిఎల్ పరీక్షకు పంపితే రూ.2800 మించి వసూలు చేయొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. కరోనా పరీక్షలు చేసే ల్యాబ్ సిబ్బంది ఐసీఎంఆర్ లాగిన్‌లో డేటాను తప్పకుండా నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేట్ ఎన్ఏబీహెచ్ ఆస్పత్రులు, ఎన్ఏబిఎల్ ల్యాబ్‌లు పరీక్షల నిర్వహణకు ముందు నోడల్ అధికారి అనుమతి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
You May Like
-
8 months ago
మరో ఎన్నికల హామీ అమలుకు రంగం సిద్ధం…
-
7 months ago
జగన్ గ్రామాల బాటపడితే ప్రజల ఇబ్బందులు తెలుస్తాయి…
-
8 months ago
వైఎస్సార్ కాపు నేస్తం….
-
9 months ago
ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్-షాక్ లో టీడీపీ
-
9 months ago
ఇప్పటికే నిధులు విడుదల చేసిన ప్రభుత్వం…