తాడేపల్లి:   వైద్య ఆరోగ్యశాఖపై సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష ప్రారంభ‌మ‌యింది. ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష కొన‌సాగుతుంది. మధ్యాహ్నం జలవనరుల శాఖపై సమీక్షించనున్నారు. రేపు వ్యవసాయం, గృహనిర్మాణ శాఖలపై సమీక్ష ఉంటుంది. 6న సీఆర్‌డీఏపై ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపటిక్రితం రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఆయన భేటీ కానున్నారు. పలు అంశాలపై ఇరువురూ చర్చించనున్నారు.

మాజీ ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్తు ఒప్పందాల్లో అవినీతివల్ల ఏడాదికి రూ.2000 కోట్లకుపైగా నష్టం వాటిల్లుతోందని ప్రాథమికంగా అర్థమవుతోందని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. ఈ నిధులను మనం ఆదా చేయగలిగితే రైతులకు పెట్టుబడి రాయితీగా చెల్లించే అవకాశముంది కదా? అని చెప్పినట్లు సమాచారం. ‘ప్రజలకు ముందుకు ఈ విషయం తీసుకెళ్లి ప్రజలకు అర్ధమైలా స్పష్టంగా చెబుదాం. ఆ సొమ్ముతో ప్రజలకు ఎలా మంచి చేస్తున్నామని చెప్పే చేద్దాం’ అని జగన్‌ […]

ఏపీ ప్రభుత్వం ఎవరిపైనో కక్ష తీర్చుకోవడానికో, ద్వేషంతోనో గత ప్రభుత్వ అవినీతి, అవకతవకలపై విచారణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించలేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా గత ప్రభుత్వ నిర్ణయాలవల్ల జరిగిన అవినీతిని నిరోధించి ప్రజాధనాన్ని కాపాడేందుకే ఈ ఆపరేషన్‌ చేపట్టామని ఆయన తెలిపారు. తెదేపా హయాంలోని నిర్ణయాల నిగ్గుతేల్చేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో ముఖ్యమంత్రి జగన్‌ ఆదివారం మొదటి సారి సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో […]

అమరావతి: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు విద్యాశాఖ ఎత్తివేసింది. గతేడాది వరకూ పబ్లిక్ పరీక్షల్లో 20 శాతం ఇంటర్నల్ మార్కులు కేటాయించింది. దీంతో ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా మార్కులు వేస్తుండటంతో పాత పద్ధతికి ప్రభుత్వం స్వస్తి చెప్పింది. ఈ ఏడాది నుంచి ఆరు సబ్జెక్టులకు 11 పేపర్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పఫ్టంచేసింది.

అమరావతి : సోషల్ మీడియా జరిగిన ఎలక్షన్ లో చురుగ్గా ఉంటూ వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం కృషి చేసిన నెటిజన్లకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

రెండోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ.. ఈ నెల 9వ తారీఖున తిరుపతికి రానున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం తిరుమల వచ్చిన మోదీ బీజేపీ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరతామని ఆ ఏడుకొండల వాడి సాక్షిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మోదీ తిరుగులేని ప్రభంజనం సృష్టించారు. మోజార్టీ సీట్లతో గెలిచిన మోదీ.. […]

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం లేఖ రాశారు. ఉండవల్లిలోని ప్రజావేదికను తనకు అధికార నివాసంగా కేటాయించాలని ఆయన ఈ సందర్భంగా ఆ లేఖలో కోరారు. కాగా  ప్రజావేదిక చంద్రబాబు ఉంటోన్న ఇంటికి అనుబంధంగా ఉందని, దాన్ని ప్రతిపక్ష నేత హోదాలో ఆయన నివాసం కోసం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగాలని పార్టీ నాయకులు సూచించగా, చంద్రబాబు ఆ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు. నిన్న తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం […]

వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. లోక్‌సభలో వైకాపా పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, విప్‌గా మార్గాని భరత్‌ను నియమించారు. ఈముగ్గురిని ఆయా పదవుల్లో నియమిస్తున్నట్లు వైకాపా అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి  కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రికి లేఖ రాశారు. విజయసాయిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. మిథున్‌రెడ్డి వరుసగా రెండో సారి లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. వైకాపాలో కీలకనేతగా ఉన్న విజయసాయిరెడ్డిని రాష్ట్రమంత్రివర్గంలోకి […]

March 2021
M T W T F S S
« Jul    
1234567
891011121314
15161718192021
22232425262728
293031