ఏపీలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు

ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డులను కొత్తగా ముద్రించి ఇస్తున్నారు. డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా వీటిని ఇస్తుండగా.. కార్డు ముందు భాగంలో కార్డు దారుని ఫోటోను ముద్రించారు. వెనకపక్కన మిగిలిన కుటుంబ సభ్యుల వివరాలతో పాటు.. కార్డు ఉద్దేశం, వైద్య సాయం వివరాలను ముద్రించారు. కాగా.. ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తుండటం తెలిసిందే.

మరోవైపు.. ఆధార్ తో అనుసంధానమైన తెలుపు రేషన్ కార్డు కలిగిన వారందరు ఈ పథకానికి అర్హులు. ఆరోగ్యశ్రీ పథకం అత్యున్నత ఆరోగ్య బీమా పథంకంగా గుర్తింపు పొందింది. దాదాపు 1038 పైగా జబ్బులకు ఈ పథకం కింద ఉచితంగా ఆరోగ్య సేవలు అందించబడుతున్నాయి. ఈ పథకం కింద అర్హులైన పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలందించడంతో పాటు రవాణా, భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ..!

Fri May 22 , 2020
Post Views: 16 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి మరోమారు భేటీ అయ్యే అవకాశాలున్నాయి.నదీజలాలే ప్రధాన అంశంగా ఇరు రాష్ట్రాల అధినేతలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత వీరి సమావేశం ఉంటుందని, ఉన్నతస్థాయి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు జూన్ మొదటి వారంలో […]
kcr
June 2020
M T W T F S S
« May    
1234567
891011121314
15161718192021
22232425262728
2930