హ్యాట్సాఫ్ టు కేసీఆర్…

హైదరాబాదు శివార్లలో దిశపై హత్యాచారం చేసిన నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ… నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘హ్యాట్సాఫ్ టు కేసీఆర్ గారు, తెలంగాణ పోలీసులు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేశారు’ అని వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.మరోవైపు, జగన్ వ్యాఖ్యలను ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫోరం తప్పుబట్టింది. ఫోరం అధ్యక్షుడు కందుల ఆనందరావు మాట్లాడుతూ, ఎన్ కౌంటర్లను జగన్ సమర్థించడం దారుణమని అన్నారు. రాజ్యాంగంపై జగన్ కు నమ్మకం లేదని మండిపడ్డారు. ఒక రెడ్డిగా జగన్ మాట్లాడారని విమర్శించారు. జగన్ చేసిన వ్యాఖ్యలను జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించాలని కోరారు. తెలంగాణలో దళిత మహిళను హత్యాచారం చేశారని… ఆ కేసులోని నిందితులను ఎన్ కౌంటర్ చేయమని కేసీఆర్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..

Fri Dec 13 , 2019
Post Views: 368 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం, పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేయడంపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. […]
jagan
January 2021
M T W T F S S
« Jul    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031