ఏపీ అసెంబ్లీ ‘దిశ’ చట్టానికి ఆమోదం తెలిపింనందుకు హర్షం….

‘దిశ’ చట్టం తీసుకొచ్చిన ఏపీ సీఎం జగన్ ప్రభుత్వంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. ‘మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై వేగంగా విచారణ జరపడానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ‘ఏపీ దిశ’ చట్టానికి ఆమోద ముద్ర వేసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఈ చట్టం సమర్థవంతంగా అమలైతే అత్యాచార బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుంది.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి చర్యలు అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను’ అని వెంకయ్య నాయుడు ట్విట్టర్ లో పేర్కొన్నారు. కాగా, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసు నేపథ్యంలో మహిళలు, చిన్నారులపై నేరాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఆమె పేరిటే చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘దిశ’ బిల్లును ఏపీ శాసనసభ నిన్న ఆమోదించింది. అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువైతే దోషికి ఈ చట్టం ప్రకారం మరణశిక్ష విధిస్తారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

నేడంతా పులివెందులలోనే....

Wed Dec 25 , 2019
Post Views: 812 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email సీఎం వైఎస్ జగన్, తన కడప జిల్లా పర్యటనలో భాగంగా, మూడో రోజున సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే గడపనున్నారు. గత రాత్రే ఇంటికి చేరుకున్న ఆయన, తనను కలిసేందుకు వచ్చిన స్థానిక నేతలను పలకరించారు. మరికాసేపట్లో ఆయన పట్టణంలోని సీఎస్ఐ చర్చికి వెళ్లి, అక్కడ జరిగే క్రిస్మస్ […]
JAGAN
January 2021
M T W T F S S
« Jul    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031