అనంతపురం జిల్లాలో ఉన్న కియా మోటార్స్ తరలిపోతుందని అంతర్జాతీయ మీడియా రాయిటర్స్ కథనం గురించి తెలిసిందే. ఈ కథనాలపై ఏపీ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. కియాపై రాయిటర్స్ కథనం పూర్తిగా అవాస్తవమని.అసత్యాలతో కూడిన కథనమని పరిశ్రమలు,వాణిజ్యం,పెట్టుబడుల శాఖ స్పెషల్ సెక్రటరీ రజత్ భార్గవ చెప్పారు. కియా, ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని.ఈ కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నారు.ఇదిలా ఉంటే.కియా ఏపీ నుంచి తరలిపోతోందని.ప్రాథమికంగా చర్చలు ప్రారంభమయ్యాయని రాయిటర్స్ కథనాన్ని ప్రచురించింది. కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడకు తరలిపోయే అవకాశం ఉందని రాయిటర్స్ చెబుతోంది. తమిళనాడు ప్రభుత్వంతో కియా ప్రతినిధులు చర్చలు జరుపుతున్నాయంటోంది. ఆ సంస్థ కియా ప్లాంట్ను రీ లోకేట్ చేసే ఆలోచనలో ఉందని.. వచ్చే వారం సెక్రటరీ లెవల్లో సమావేశం జరగనుందని.ఆ తర్వాత ప్లాంట్ తరలింపుపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాయిటర్స్ అంటోంది. పీలో ఆ సంస్థకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఈ నిర్ణయం తీసుకుందని.అందుకే ప్లాంట్ తరలించాలని భావిస్తున్నారని తమిళనాడుకు చెందిన కీలక అధికారి కూడా దీన్ని ధృవీకరించినట్లు ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది. కియాకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని నిబంధనలు అడ్డంకిగా మారాయట.అందులో స్థానికులకు 75శాతం ఉద్యోగాల నిబంధన ప్రధానంగా ఇబ్బందిగా మారిందని రాయిటర్స్ చెబుతోంది.దీంతో ఏపీ ప్రభుత్వం స్పందించి క్లారిటీ ఇచ్చింది.
Next Post
ఏపీ రాజధాని దొనకొండ
Thu Feb 6 , 2020
Post Views: 163 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ఏపీ రాజధాని అయ్యే అవకాశం ఉందంటూ అనేకసార్లు వార్తల్లో నిలిచిన ప్రకాశం జిల్లా దొనకొండ మరోసారి వార్తల్లో నిలిచింది. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన వైసీపీ ప్రభుత్వం.దొనకొండ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమి అందుబాటులో ఉందని […]

You May Like
-
7 months ago
లబ్ధిదారులతో ఆన్లైన్లో మాట్లాడిన జగన్ …
-
7 months ago
వ్యవసాయ బడ్జెట్ కూర్పుపై సీఎం…
-
6 months ago
కేసులు ఎక్కువున్న ప్రాంతాల్లో ఇంటింటి సర్వే…
-
1 year ago
YSRCP Araku Valley (ST) MLA Chetti Palguna