సీఎం జగన్ స్టే ఇవ్వాల్సిందే.. అసదుద్దీన్ డిమాండ్

ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకించాలని సీఎం వైఎస్ ‌జగన్‌మోహన్‌రెడ్డిని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరుతున్నట్లు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. వెంటనే ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై స్టే విధించాలని ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఏపీకి నిధులు ఇవ్వరు గానీ.. ఎన్‌పీఆర్ అమలుకు మాత్రం నిధులు ఉన్నాయా అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు

దేశంలో 2024 వరకు పౌరసత్వ చట్టాలను అమలు కానివ్వబోమని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ స్పష్టం చేశారు. పౌరసత్వ చట్టాలతో భారత్‌‌ను హిందూ దేశంగా మార్చాలనే కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌‌లకు వ్యతిరేకంగా ఆదివారం కర్నూలులో ఎంఐఎం అధినేత ఒవైసీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు సంబంధం లేదని కేంద్రం అసత్యాలు చెబుతోందని మండిపడ్డారు. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు ఒకదానితో మరొకదానికి సంబంధం ఉందని స్పష్టం చేశారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

నిజాయతీపరుడ్ని సస్పెండ్ చేస్తారా?

Mon Feb 10 , 2020
Post Views: 170 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు సస్పెన్షన్ వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏబీ సస్పెన్షన్ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ అధికారులంతా గజగజావణికిపోతున్నారని, డిప్యుటేషన్ పై కేంద్రానికి వెళ్లే ఆలోచనలో ఉన్నారని ఎల్లో మీడియా రేపో, మాపో సిగ్గులేని రాతలు రాస్తుందని ట్వీట్ చేశారు. “నిప్పు నాయుడే […]
JAGAN
March 2021
M T W T F S S
« Jul    
1234567
891011121314
15161718192021
22232425262728
293031