అర్చకుల కు జగన్ అన్న

అవధూత దత్తపీఠం వ్యవస్థాపకులు గణపతి సచ్చిదానంద స్వామి సీఎం వైఎస్ జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. తండ్రి వైఎస్సార్ అడుగుజాడల్లోనే జగన్ కూడా నడుస్తున్నారని, ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల అనువంశిక వారసత్వ హక్కులను పునరుద్ధరిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం అని అభినందించారు. జగన్ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకం తనకుందని అన్నారు.అంతేకాకుండా ఇంగ్లీషు మీడియం అంశంపైనా గణపతి సచ్చిదానంద తన అభిప్రాయాలు వెల్లడించారు. ఇతర దేశాలకు వెళ్లడానికి అవసరమయ్యే వీసా ఇంటర్వ్యూలోనూ ఇంగ్లీషు అవసరమని, ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇంగ్లీషు మీడియం వ్యవహారాన్ని వివాదాస్పదం చేయడం మానుకోవాలని హితవు పలికారు. వారణాసిలో నిర్వహిస్తున్న అతిరుద్ర యాగం పదో రోజు సందర్భంగా మాట్లాడుతూ స్వామి గణపతి సచ్చిదానంద ఈ వ్యాఖ్యలు చేశారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు...

Sun Nov 24 , 2019
Post Views: 357 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఉల్లిధర పెంచుకుంటూ పోతూ 100 రూపాయలు చేయడం ద్వారా సెంచరీ కొట్టారని, ఇసుక ధర 5 రెట్లు పెంచారని […]
naralokesh jagan
August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31