బాబు దారిలోనే జగన్….

‘‘ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు ఏ విధానాలను అవలంభించారో వాటినే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయంలో జన్మభూమి కమిటీ సభ్యులపై ఆరోపణలు చేసిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు తన పార్టీ కార్యకర్తలను గ్రామ వలంటీర్లుగా నియమించుకున్నారు’’ అని బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు విమర్శించారు. తాను క్రైస్తవుడినని అని ప్రకటించుకున్న సీఎం జగన్‌… డిక్లరేషన్‌ ఇవ్వకుండా శ్రీ వేంకటేశ్వరస్వామిని ఏ విధంగా దర్శించుకుంటారని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సహేతుక విమర్శలను జీర్ణించుకోలేకనే వైసీపీ ఎంపీలు బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని శుక్రవారం మీడియా వద్ద బీజేపీ నేత లంకా దినకర్‌ మండిపడ్డారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అర్చకుల కు జగన్ అన్న

Sun Nov 24 , 2019
Post Views: 280 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email అవధూత దత్తపీఠం వ్యవస్థాపకులు గణపతి సచ్చిదానంద స్వామి సీఎం వైఎస్ జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. తండ్రి వైఎస్సార్ అడుగుజాడల్లోనే జగన్ కూడా నడుస్తున్నారని, ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల అనువంశిక వారసత్వ […]
Sri Ganapathi Sachchidananda Swamiji
July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031