ఏపీలో మోగిన స్థానిక ఎన్నికల నగారా…

రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది.తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు.మొత్తమ్మీద ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికలను పూర్తిచేసేలా షెడ్యూల్ రూపొందించారు.

ఈనెల 21న జరగనున్న ఎంపీటీసీ జెడ్సీ ఎన్నికల కోసం 9 నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12న నామినేషన్ల పరిశీలన, 14 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. మార్చి 24వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

మున్సిపాలిటీలకు మార్చి 23న ఎన్నికలు నిర్వహించి 27న ఫలితాలు వెల్లడిస్తారు.
పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నారు.తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 15వ తేదీన విడుదలవుతుంది. 17 నుంచి 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 27వ తేదీన ఎన్నికలు నిర్వహించి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు.

రెండో విడత ఎన్నికలకు 17వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 19 నుంచి 21వ తేదీ మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. 29వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

YES బ్యాంక్‌ స్కామ్‌ లో చంద్రబాబు

Tue Mar 10 , 2020
Post Views: 30 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email YES బ్యాంక్‌ స్కామ్‌తో చంద్రబాబుకు లింకులు ఉన్నాయా? అంటే అవుననే అంటున్నారు వైసీపీ మంత్రులు. ఎస్‌ బ్యాంక్ స్కామ్‌ తో మాజీ సీఎం చంద్రబాబుకు లింకులు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు ఏపీ మంత్రి పేర్నినాని.చంద్రబాబు తన హవాలా కోసం ఎస్‌ బ్యాంకును ఉపయోగించుకున్నారని, అవినీతి సొమ్మును […]
JAGAN
June 2020
M T W T F S S
« May    
1234567
891011121314
15161718192021
22232425262728
2930