బాబు కరోనా వైరస్ కంటే పెద్ద వైరస్

ANILKUMARYADAV

చంద్రబాబు నాయుడు కరోనా వైరస్ కంటే పెద్ద వైరస్ గా తయారయ్యారని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.కరోనా వైరస్ పేరు చెప్పి స్థానిక ఎన్నికలను చంద్రబాబు వాయిదా వేయించారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేషకుమార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.నిర్ణయం తీసుకొనే ముందు ఏ అధికారుల నైనా సంప్రదించారా? అని సూటిగా ప్రశ్నించారు.చంద్రబాబు తో చర్చించి ఎన్నికల వాయిదా ఏకపక్షంగా తీసుకున్నారని ఆరోపించారు.ఎన్నికల కమిషన్ కి విచక్షణ అధికారం ఉందని, విచక్షణ కోల్పోయి తీసుకొనే అధికారం ఎక్కడిది అని రమేష్ కుమార్ పై ధ్వజమెత్తారు. అయితే 45 రోజుల ఎన్నికల కోడ్ ఉందని చెబుతూనే చంద్రబాబు కుట్ర పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారు అని దుయ్యబట్టారు.అయితే ఫ్రాన్స్ లో 5500 కరోనా కేసులు, మరియు 127 మంది చనిపోతే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారని, ఇక్కడ అంత దారుణ పరిస్తితి లేదని, ఇది చంద్రబాబు ఎత్తుగడ అని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికల వాయిదా వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

23న పార్టీ జెండా ఎగరవేయాలి

Wed May 20 , 2020
Post Views: 114 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ప్రజల ఆశలు-ఆకాంక్షలకు అనుగుణంగా వారి జీవన ప్రమాణాల్లో సంక్షేమ కార్యక్రమాలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమూల మార్పులు తెచ్చారని ప్రభుత్వ సలహాదారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఘన విజయం సాధించి మే 23వ తేదీకి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, […]
jagan
June 2020
M T W T F S S
« May    
1234567
891011121314
15161718192021
22232425262728
2930