చంద్రబాబు పై హైకోర్టులో ఫిర్యాదు

ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు రెండు నెలల తరువాత సోమవారం ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా టీడీపీ శ్రేణుల నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే ఆయనకు మొదటి రోజే షాక్‌ తగిలింది.హైదరాబాద్ నుంచి కాన్వాయ్‌లో బయలుదేరిన చంద్రబాబు పలుచోట్ల కారు దిగి మరీ జనాలను పలకరించారు.

chandrababu


దీంతో బాబు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి, కరోనా వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణమయ్యారంటూ చిత్తూరు జిల్లాకు చెందిన మొహమ్మద్ అలీ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.చంద్రబాబు లాక్‌డౌన్‌ రూల్స్‌ ఉల్లఘించారని వీడియోలను ఆధారాలు సమర్పిస్తూ ఏపీ డీజీపీ, విజయవాడ పోలీస్‌ కమిషనర్, కృష్ణా జిల్లా ఎస్పీతో పాటు తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో అలీ ఫిర్యాదు చేశారు.ఆ ఫిర్యాదుకు సంబంధించిన కాపీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దీనిపై తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే చంద్రబాబు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి ఏకంగా హైకోర్టుకే ఫిర్యాదు చేయడం గమనర్హం.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్‌-షాక్‌ లో టీడీపీ

Tue May 26 , 2020
Post Views: 338 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. పార్టీ అధిష్టానం మీద నమ్మకం లేని నేతలు కొందరు, అధిష్టాన వైఖరి నచ్చని వారు కొందరు ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వీడటానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.కాగా తాజాగా మరో ఇద్దరు […]
ys jagan vs chandra babu
November 2020
M T W T F S S
« Jul    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30