YES బ్యాంక్‌ స్కామ్‌ లో చంద్రబాబు

YES బ్యాంక్‌ స్కామ్‌తో చంద్రబాబుకు లింకులు ఉన్నాయా? అంటే అవుననే అంటున్నారు వైసీపీ మంత్రులు. ఎస్‌ బ్యాంక్ స్కామ్‌ తో మాజీ సీఎం చంద్రబాబుకు లింకులు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు ఏపీ మంత్రి పేర్నినాని.చంద్రబాబు తన హవాలా కోసం ఎస్‌ బ్యాంకును ఉపయోగించుకున్నారని, అవినీతి సొమ్మును దేశం దాటించేందుకు వినియోగించుకున్నారని ఆరోపించారు. ఎస్‌ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్‌తో చంద్రబాబుకు ఉన్న లింకులపై కేంద్రం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని కోరారు మంత్రి పేర్ని నాని.
వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో ఏపీని ప్రమోట్‌ చేయడానికి YES బ్యాంక్‌ భాగస్వామ్యంతో “టూరిజం మిషన్‌ డాక్యుమెంట్‌” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2015 సెప్టెంబర్‌లో అప్పటి సీఎం చంద్రబాబు టూరిజం మిషన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు.దీని కోసం YES బ్యాంక్‌కు కన్సల్టెన్సీ ఫీజు కింద ప్రభుత్వం భారీగానే డబ్బు చెల్లించింది.ఆ తర్వాత 2017 మార్చిలో ఢిల్లీలో జరిగిన ”YES బ్యాంక్‌ అండ్‌ ది ఎకనామిక్‌ టైమ్స్‌ గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌” కార్యక్రమానికి ఏపీ,అధికారిక స్టేట్‌ పార్ట్‌నర్‌గా వ్యహరించింది.ఈ కార్యక్రమం ద్వారా 2029 నాటికి ఏపీని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇది ఏమైందో తెలీదు.తన హయాంలో రెండుసార్లు YES బ్యాంక్‌తో లింకులు పెట్టుకున్న చంద్రబాబు అవినీతి సొమ్మును దేశం దాటించేందుకు అదే బ్యాంక్‌ను ఉపయోగించుకున్నారని వైసీపీ మంత్రులు ఆరోపిస్తున్నారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పులివెందులలో టీడీపీకి భారీ షాక్‌

Tue Mar 10 , 2020
Post Views: 69 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email కడప జిల్లాలో టీడీపీకి భారీ షాక్‌ తగలబోతోంది.పులివెందులలో టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న సతీష్‌ రెడ్డి వైసీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సతీష్‌ రెడ్డి ఇవాళ సమావేశమవుతున్నారు. వైసీపీలో చేరికకు సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తయినట్లు సమాచారం. ఈ నెల 13వ తేదీన ఆయన […]
pulivendula
June 2020
M T W T F S S
« May    
1234567
891011121314
15161718192021
22232425262728
2930