23న పార్టీ జెండా ఎగరవేయాలి

ప్రజల ఆశలు-ఆకాంక్షలకు అనుగుణంగా వారి జీవన ప్రమాణాల్లో సంక్షేమ కార్యక్రమాలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమూల మార్పులు తెచ్చారని ప్రభుత్వ సలహాదారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఘన విజయం సాధించి మే 23వ తేదీకి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలకు బుధవారం లేఖ రాశారు. తొలి ఏడాదిలోనే ఎన్నికల హామీలను 90 శాతం నెరవేర్చడమే కాకుండా.. మేనిఫెస్టోలో లేని మరో 40 కొత్త పథకాలను కూడా అమలు పరిచారన్నారు.

దేశంలో అత్యుత్తమ సీఎంగా.. మంచి మనుసున్న సీఎంగా.. వైఎస్ జగన్‌ ప్రజల మన్ననలు పొందారని సజ్జల లేఖలో పేర్కొన్నారు. 23న అన్ని నియోజకవర్గ హెడ్‌క్వార్టర్స్‌ల‌తో పాటు మండల కేంద్రాల్లో పార్టీ జెండా ఎగురవేయాలని, పేదలకు పండ్ల పంపిణీతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి డేటా సేకరించాలని, అన్ని నియోజకవర్గాల్లో సాధించిన ప్రగతిపై వీడియోలు, ప్రకటనల రూపంలో సీఎం జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన రోజైన మే 30వ తేదీ వరకు ప్రచారం నిర్వహించాలన్నారు. ఏడాది పాలన, ప్రగతి పథకాలపై ఇప్పటికే ప్రభుత్వం 23 నుంచి 30 వరకు కార్యక్రమాలకు రూపకల్పన చేసిందని, అందుకు అనుగుణంగానే కరోనా నిబంధనలతో కార్యక్రమాలు చేయాలని సజ్జల లేఖలో సూచించారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం..

Wed May 20 , 2020
Post Views: 20 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ఏపీలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి నవరత్నాలను అమలు చేయడమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు సంక్షేమ పధకాలను అమలు చేసి సామాన్యులకు అండగా నిలుస్తున్నారు. ఇక తాజాగా రైతు భరోసా డబ్బును లబ్దిదారులైన రైతులకు అందించిన జగన్.. […]
raithu-barosa-be-start-oct-15th-says-ys-jagan
June 2020
M T W T F S S
« May    
1234567
891011121314
15161718192021
22232425262728
2930