భారీగా తగ్గించిన పీజీ వైద్య విద్య ఫీజులు..

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య ఫీజులను భారీగా తగ్గిస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది.డబ్బున్న వారికే పీజీ వైద్య విద్య సొంతం కాకూడదనే ఉద్దేశ్యంతో పేద విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని జగన్ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కన్వీనర్‌ కోటా, యాజమాన్య కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటాలన్నింట్లోనూ ఫీజులను తగ్గించింది. ఈ తగ్గించిన పీజీ వైద్య విద్య ఫీజులు 202-21 నుంచి 2022- 2023 వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.

మైనారిటీ, నాన్- మైనారిటీ, ప్రైవేటు అన్ ఎయిడెడ్ కళాశాలలన్నింటికి కూడా ఒకే తరహ ఫీజులు ఉండనున్నాయి. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ బృహత్తర నిర్ణయంతో దాదాపు అన్ని కేటగిరీలలోనూ ఫీజులు సగానికి సగం తగ్గిపోయాయి. కాగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు పీజీ వైద్య విద్య సీట్ల భర్తీలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు భారీ లబ్ధి చేకూరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఒకే రోజులో 8,392కొత్త కరోనా కేసులు

Mon Jun 1 , 2020
Post Views: 280 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email భారత్‌లో కరోనా వైరస్ క్రమంగా విజృంభిస్తోంది.రోజురోజుకు రికార్డుస్థాయిలో కొత్త కేసులతో మరణ మృదంగం మోగిస్తోంది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టడికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నప్పటికీ కేసులు మాత్రం తగ్గడంలేదు.కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం,గత 24 […]
November 2020
M T W T F S S
« Jul    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30