“నేను విన్నాను.. నేను ఉన్నాను” అన్న నినాదంతో

”నేను విన్నాను.. నేను ఉన్నాను” అన్న నినాదంతో గతేడాది మే 23న 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లతో అఖండ విజయాన్ని సాధించిన వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ్టికి సరిగ్గా ఏడాది అవుతోంది. మే 30న విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో అశేష అభిమానుల మధ్య ప్రమాణ స్వీకారం చేసిన జగన్, నవ్యాంద్రప్రదేశ్‌ రెండో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి మేనిఫెస్టోను అమలు చేయడమే ముఖ్య ఉద్దేశ్యంగా పెట్టుకున్న జగన్.. ఒక్క ఏడాదిలోనే 90శాతం హామీలను నెరవేర్చారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోకుండా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్‌తో పరిపాలన చేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు జగన్.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

భారీగా తగ్గించిన పీజీ వైద్య విద్య ఫీజులు..

Sat May 30 , 2020
Post Views: 52 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య ఫీజులను భారీగా తగ్గిస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది.డబ్బున్న వారికే పీజీ వైద్య విద్య సొంతం కాకూడదనే ఉద్దేశ్యంతో పేద విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని జగన్ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కన్వీనర్‌ […]
jagan
July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031