తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి మరోమారు భేటీ అయ్యే అవకాశాలున్నాయి.నదీజలాలే ప్రధాన అంశంగా ఇరు రాష్ట్రాల అధినేతలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత వీరి సమావేశం ఉంటుందని, ఉన్నతస్థాయి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు జూన్ మొదటి వారంలో ఈ భేటీ ఉండవచ్చనే సమాచారం.నదుల అనుసంధాన సమస్యపై గతంలో మూడుసార్లు ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది.

తాజా మీడియా సమావేశంలోనూ మొత్తం కృష్ణా, గోదావరిలో నీటి లభ్యత ఇరు రాష్ట్రాల అవసరాల ప్రాతిపదికగా ముందుకు వెళ్తామని కేసీఆర్‌ ప్రతిపాదించారు. పోతిరెడ్డిపాడు జీవో కేంద్రంగా ప్రస్తుతం ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు వివిధ వేదికలపై పోరాడుతున్న నేపథ్యంలో.. ఇరువురు ముఖ్యమంత్రుల భేటీతోనే ఈ అంశం కొలిక్కివస్తుందని భావిస్తున్నారు. అపెక్స్‌కు వెళ్ళకుండానే పరస్పరం చర్చించుకుని సమస్య పరిష్కరించుకునే యోచనలో అధినేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే త్వరలో జరిగే సీఎంల భేటీలోనూ.. పోతిరెడ్డిపాడుకు సంబంధించి ఇదేవిధమైన చర్చ జరిగే అవకాశముందని విశ్లేషకుల అభిప్రాయం

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

నేటితో ఏడాది 151 సీట్లతో ఘన విజయం సాధించి

Sat May 23 , 2020
Post Views: 16 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ఏపీలో 2019లో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో 151 స్థానాలు, లోక్ సభలో 22 సీట్లు గెలిచిన వైసీపీ చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. ఇప్పుడా విజయానికి ఏడాది నిండిన సందర్భంగా వైసీపీ సోషల్ మీడియాలో […]
June 2020
M T W T F S S
« May    
1234567
891011121314
15161718192021
22232425262728
2930