కంటైన్మెంట్‌ జోన్లు మినహా అన్ని చోట్లా దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరవొచ్చు

పట్టణ ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపార సంస్థల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. మే 31 వరకు ప్రకటించిన నాలుగో విడత లాక్‌డౌన్‌లో జిల్లా కలెక్టర్లు కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో మినహా ఇతర పట్టణాల్లో ఎంపిక చేసిన దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరిచేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్‌ కమిషనర్లు తమ పరిధిలో పరిస్థితిని సమీక్షించి దుకాణాలు తెరిచేందుకు కార్యాచరణ చేపట్టాలని పేర్కొంది. వాటిని పురపాలక, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, పరిశ్రమలు, మార్కెటింగ్, మత్స్య, రవాణా శాఖలు పాటించాలని చెప్పింది. పట్టణ ప్రాంతాల్లో అనుమతించిన దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరవొచ్చు. మందుల దుకాణాలకు మరింత సమయం అనుమతిస్తారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

వైఎస్‌ జయంతి రోజున ఇళ్ల పట్టాల పంపిణీ

Thu May 21 , 2020
Post Views: 228 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి జూలైన 8న అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు మున్సిపల్‌ కమషనర్‌ నరసింహారెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం వారు విలేకరులతో మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి […]
ysr
December 2020
M T W T F S S
« Jul    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031