ఒకే నోటిఫికేషన్‌ ద్వారా 9,700 పోస్టులను భర్తీ

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో గత పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఒకే నోటిఫికేషన్‌ ద్వారా 9,700 పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ నియామకాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.వైద్య విద్యా శాఖలో.. బోధనాస్పత్రులు, వైద్య విధాన పరిషత్‌లో సామాజిక ఆరోగ్య కేంద్రాలు,ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ప్రజారోగ్య శాఖ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేందుకు స్పెషలిస్టు డాక్టర్ల నుంచి స్టాఫ్‌ నర్సుల వరకు మొత్తం 9,700 పోస్టులను భర్తీ చేస్తారు.ఈ నియామకాల నోటిఫికేషన్‌ను నేడో, రేపో జారీ చేయనున్నారు.వైద్య విద్యాశాఖ పరిధిలో 15 కొత్త వైద్య కళాశాలలు, నాడు–నేడులో భాగంగా ఆస్పత్రి భవనాల పునర్నిర్మాణం, కొత్త భవనాల నిర్మాణం వంటి పలు కార్యక్రమాలు చేపట్టింది. 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 68 మందికి కరోనా పాజిటివ్

Wed May 27 , 2020
Post Views: 51 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email
July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031