ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధిస్తామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.హోదా వస్తే ప్రోత్సాహకాలు మెండుగా ఉండేవని,ఇవాళ కాకపోతే రేపయినా వస్తుందని ఆయన స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల్లో రాష్ట్రం మెరుగ్గా ఉందని,రాష్ట్రంపై కేంద్రం ఆధారపడే రోజులు వస్తాయని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది నిండిన నేపథ్యంలో నాలుగోరోజు వైసీపీ మేధోమథనం సదస్సులో ‘మన పాలన-మీ సూచన’ అంశంపై జగన్ మాట్లాడారు.

ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఎన్నో కంపెనీలు వచ్చేవని,గత టీడీపీ ప్రభుత్వం హోదాను తీసుకురాలేకపోయిందని జగన్ విమర్శించారు. మరోవైపు,గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని,లేదంటే ఆ పార్టీకి మద్దతిచ్చే క్రమంలో ప్రత్యేక హోదా డిమాండ్‌ చేసేవాళ్లమని చెప్పారు.అయితే, భవిష్యత్‌లో మాత్రం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే బీజేపీ ఇతర పార్టీలపై ఆధారపడే పరిస్థితి వస్తుందని,తాము అప్పుడు హోదా డిమాండ్ చేస్తామన్నారు.గత టీడీపీ ప్రభుత్వం గ్రాఫిక్స్‌ చూపించి ప్రజలను మోసం చేసిందని, ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో తొలి ర్యాంక్‌ అంటూ గొప్పగా చెప్పుకుందని తెలిపారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మరణాల్లో చైనాను దాటేసిన భారత్..

Fri May 29 , 2020
Post Views: 464 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email దేశంలో కరోనా వైరస్ ఉద్దృత్తి కొనసాగుతోంది.రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 7466 కేసులు నమోదు కాగా, 175 మంది చనిపోయారు.అటు కొన్ని రోజులుగా ప్రతీ రోజూ 6 వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం.తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ […]
May 2021
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31