కరోనా విలయం…

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 10,331కి ఎగబాకింది. 24 గంటల్లో 36,047 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా స్థానికుల్లో 448 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 37 మందికి, విదేశాల నుంచి వచ్చిన 12 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అనంతపురంలో గత మూడు రోజుల్లో దాదాపు 300 కేసులు బయటపడ్డాయి. ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య వెయ్యి (1028) దాటింది. ప్రస్తుతం ఈ జిల్లాలోనే అత్యధిక యాక్టివ్‌ కేసులున్నాయి. కర్నూలు (1483), కృష్ణా (1132) జిల్లాలు ఇప్పటికే వెయ్యి మార్కుని దాటేశాయి. ఇక గడిచిన 24 గంటల్లో 146 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకూ 4779 మంది కోలుకున్నారు. 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

జగన్ ఇలాకాలో బీజేపే మార్క్...

Thu Jun 25 , 2020
Post Views: 144 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ప్రధాని నరేంద్రమోదీ ప్రభావం ఏపీ సీఎం జగన్ ఇలాకాపై కూడా ప్రసరిస్తోందా? వైసీపీ ప్రాబల్యం అధికంగా ఉన్న కడప జిల్లాను బీజేపీ పెద్దలు రాజకీయంగా టార్గెట్ చేశారా? ప్రస్తుతం ఆ జిల్లాలో ప్రధాని మోదీ జపం ఎక్కువగా ఎందుకు వినిపిస్తోంది? కడప గడపలో కమలం పార్టీకి కలిసొస్తున్న […]
April 2021
M T W T F S S
« Jul    
 1234
567891011
12131415161718
19202122232425
2627282930