వరికపుడిశెల ఎత్తిపోతల సాకారం…

తీవ్ర దుర్భిక్షంతో తల్లడిల్లుతున్న ‘పల్నాటి సీమ’ను సుభిక్షం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రూ.1,750 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోతల పథకం, రూ.6,020 కోట్లతో వైఎస్సార్‌ పల్నాడు ఎత్తిపోతల పథకం పనులను ‘వైఎస్సార్‌ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్‌’ కింద చేపట్టి వరద జలాలను తరలించడం ద్వారా పల్నాడును సస్యశ్యామలం చేయాలని నిర్ణయించింది. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధుల సమీకరణ కోసం ఎస్పీవీ(స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌)ను ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖను ఆదేశించింది. వరుసగా వర్షాభావంతో పల్నాడు కరవు కోరల్లో చిక్కుకుపోయింది. గుక్కెడు తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దుస్థితి నెలకొంది. పల్నాడు ప్రజల ఏడు దశాబ్దాల స్వప్నమైన వరికపుడిశెల ఎత్తిపోతల పథకాన్ని సాకారం చేయడం, పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలించిన గోదావరి జలాలను వైఎస్సార్‌ పల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా అందచేసి ఆ ప్రాంత తాగు, సాగునీటి కష్టాలను కడతేర్చ డానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జలవనరుల శాఖను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అమరవీరులకు శాసనసభ సంతాపం...

Thu Jun 18 , 2020
Post Views: 104 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email గాల్వన్‌ లోయ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవానులకు రాష్ట్ర శాసనసభ సంతాపం ప్రకటించింది. బుధవారం ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అమర వీరులకు సంతాపం తెలుపుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు విధి నిర్వహణ […]
January 2021
M T W T F S S
« Jul    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031