పులివెందులలో టీడీపీకి భారీ షాక్‌

pulivendula

కడప జిల్లాలో టీడీపీకి భారీ షాక్‌ తగలబోతోంది.పులివెందులలో టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న సతీష్‌ రెడ్డి వైసీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సతీష్‌ రెడ్డి ఇవాళ సమావేశమవుతున్నారు. వైసీపీలో చేరికకు సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తయినట్లు సమాచారం. ఈ నెల 13వ తేదీన ఆయన వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. పులివెందులలో వైఎస్ ఫ్యామిలీని ఎదిరించి నిలబడ్డ నేతగా సతీష్ రెడ్డికి పేరుంది. వై.ఎస్.రాజశేఖర రెడ్డి, జగన్‌లపై నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయిన సతీష్ రెడ్డి టీడీపీకి అన్నీతానై వ్యవహరిస్తున్నారు. దీంతో టీడీపీ ఆయన్ను ఎమ్మెల్సీగా పంపి మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించింది.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

వైసీపీ రాజ్యసభ సభ్యుల వీరే

Tue Mar 10 , 2020
Post Views: 110 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email నలుగురు వైసీపీ రాజ్యసభ సభ్యుల ఎంపికను సీఎం జగన్ ఖరారు చేశారు.వైసీపీ రాజ్యసభ సభ్యుల పేర్లను ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి ప్రకటించారు.అందరితో చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమాల్ నత్వాని ఖరారు […]
ysrcp-mps
June 2020
M T W T F S S
« May    
1234567
891011121314
15161718192021
22232425262728
2930