సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు…పిల్లి సుభాష్‌

ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు, ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ.. బీసీ వర్గానికి చెందిన మాకు రాజ్యసభలో చోటు కల్పించడం అరుదైన సన్నివేశం. కలలో కూడా ఊహించనిది జరిగింది. నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. మా అందరిపైనా ఇప్పుడు గురుతర బాధ్యత ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. విభజన చట్టం లో హామీలు ఇంకా పరిపూర్ణంగా అమలు కాలేదు .విభజన చట్టం అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం.  బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఆంధప్రదేశ్‌లో రూ.40 వేల కోట్లు పైగా ఖర్చు పెట్టడం ఆల్‌టైమ్‌ రికార్డు. వ్యవసాయ రంగానికి రూ.19 వేల కోట్ల రూపాయలు కేటాయించాం. విద్యా, వైద్య రంగాల మీద పెట్టిన ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌గా సీఎం వైఎస్‌ జగన్‌ భావిస్తున్నారు. 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

జగన్‌కు రుణపడి ఉంటాం...

Thu Jul 23 , 2020
Post Views: 86 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ పేర్లను నామినేట్‌ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తాము రుణపడి ఉంటామని అమలాపురం మాజీ ఎంపీ డాక్టర్‌ పండుల రవీంద్రబాబు, మైనార్టీ మహిళా నేత ఎం.జకియా ఖానమ్‌లు పేర్కొన్నారు. మంగళవారం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు […]
jagan mohan
November 2020
M T W T F S S
« Jul    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30