బడ్జెట్‌లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత…

బడ్జెట్‌లో వ్యవసాయానికి అత్యధికంగా నిధులు కేటాయించిన ఘనత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికే దక్కుతుందని ఏపీ వ్యవసాయ మిషన్‌ వైఎస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు మేలు చేసేలా సంకల్ప బలంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకెళ్తున్నారన్నారు. ప్రకృతి కూడా సహకరించి గత పది సంవత్సరాల్లో లేని విధంగా ఆహార ధాన్యాలు దిగుబడి గత ఏడాది కంటే పెరిగాయని పేర్కొన్నారు. ఉత్పత్తులు పెరగడమే కాదని.. సరాసరి దిగుబడులు కూడా పెరిగాయని తెలిపారు.కరోనా సంక్షోభం మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది ఆదాయం పెరిగే అవకాశం లేనందున, మొత్తం బడ్జెట్‌ గత ఏడాది కంటే 1.4 శాతం తగ్గిందని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.2,24,789.18 కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టారని.. అందులో వ్యవసాయానికి 29,159.97 కోట్లు కేటాయించారన్నారు. రెండో సంవత్సరం కూడా రెండంకెల శాతం వ్యవసాయ రంగానికి అధికంగా నిధులు కేటాయించారన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఆరోగ్యశాఖకు రూ.11,419.44 కోట్లు...

Tue Jun 16 , 2020
Post Views: 110 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. పేదలకు పూర్తి స్థాయి ఆరోగ్య సేవలను అందించడమే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం’ పరిధిని విస్తరించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 1059 ఆరోగ్య విధానాలతో పాటు, అదనంగా 1000 ఆరోగ్య విధానాలను కూడా […]
November 2020
M T W T F S S
« Jul    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30