రాష్ట్ర వ్యాప్తంగా నదీతీర ప్రాంతాల్లో సురక్షిత బోటింగ్ కోసం ఏపీ ప్రభుత్వం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. శుక్రవారం రోజున తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టూరిజం కంట్రోల్ రూమ్లను ప్రారంభించారు. నదీతీర ప్రాంతాలైన శింగనపల్లి ( పశ్చిమ గోదావరి), గండి పోచమ్మ (తూర్పు గోదావరి), పేరంటాలపల్లి( పశ్చిమ గోదావరి), పోచవరం( పశ్చిమ గోదావరి), రాజమండ్రి (తూర్పు గోదావరి), రుషికొండ ( విశాఖపట్నం), నాగార్జునసాగర్( గుంటూరు), శ్రీశైలం( కర్నూలు), బెర్మ్ పార్క్ (విజయవాడ)లలో టూరిజమ్ రూమ్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అనంతరం కంట్రోల్ రూమ్స్ వద్దనున్న కలెక్టర్లను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. చదవండి: రూ.1,210 కోట్లతో 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీలు
Next Post
మరో ఎన్నికల హామీ అమలుకు రంగం సిద్ధం...
Wed Jun 24 , 2020
Post Views: 130 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email కోవిడ్–19 లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయినప్పటికీ ఎన్నికల హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా దారిద్య్ర రేఖకు దిగువనున్న అర్హులైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య […]

You May Like
-
2 years ago
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రుల శాఖలు ఖరారు
-
2 years ago
రంజాన్ పండగ శుభాకాంక్షలు
-
8 months ago
ఎంపీ రఘురాజు మరో లేఖ…
-
1 year ago
చంద్రబాబు అన్నింటికి తెగబడి పోయాడు
-
1 year ago
Kurupam MLA Pamula Pushpa Sreevani YSRCP MLA
-
1 year ago
అలసత్వం వద్దు