నారా లోకేష్ చౌదరికి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించే సమయం లేదు గానీ, అవినీతికి పాల్పడిన టీడీపీ గజ దొంగలను మాత్రం పరామర్శించేందుకు వెళ్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చురకలంటించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారని విమర్శించారు. పేదల కష్టార్జితాన్ని దోపిడీ చేసిన అచ్చెన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించారని తెలిపారు. శుక్రవారం మంత్రి వెల్లంపల్లి పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.‘ఈఎస్ఐ స్కాంలో తన పేరు ఎక్కడ బయట పెడతారోననే భయంతో లోకేష్ అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిలువుగా, అడ్డంగా పెరిగితే బాహుబలి కాదు. ప్రజల సమస్యలను పరిష్కరించే సీఎం వైఎస్ జగన్ నిజమైన బాహుబలి. మీరందరూ కాలకేయుల్లాంటోళ్లు. వైఎస్ జగన్మోహన్రెడ్డి దెబ్బకు టీడీపీ 23 స్థానాలకు పడిపోయింది. వైఎస్ రాజారెడ్డి గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు ఉందా. గతంలో ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే అరెస్టులు చెయలేదా.
Next Post
సీఎం పర్యటన
Sat Jun 27 , 2020
Post Views: 113 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email వచ్చే నెల 7, 8తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిఇడుపులపాయలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు . రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ విషయాలు తెలిపారు. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ […]

You May Like
-
1 year ago
Ysrcp Guntakal MLA Y.Venkatarama Reddy
-
1 year ago
Paderu MLA Bhagya Lakshmi
-
1 year ago
YSRCP Ponnuru MLA Venkatroshiah Kilari
-
6 months ago
సచివాలయాల ద్వారా ఇకపై పేదలకు ఉచితంగా ఇసుక…