తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని ఫోన్‌…

కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజా పరిస్థితులపై ఆరా తీశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదివారం ఫోన్‌ చేసి కరోనా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు మోదీ ఫోన్‌ చేశారు. కరోనా తీవ్రత, కట్టడికి చేపడుతున్న నివారణ చర్యలు, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. అలాగే వైరస్‌ను నివారించుటకు పలు సూచనలు, సలహాలు సైతం చేశారు. మరోవైపు వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్న బిహార్‌, అసోం, తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని ముచ్చటించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.  కరోనా పరీక్షలను రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్న తమిళనాడు,  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులకు మోదీ అభినందనలు తెలిపారు. కాగా దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,77,618కి చేరింది. దీంతో పలు రాష్ట్రాలు మళ్లీ లాక్‌డౌన్‌ మం‍త్రాన్ని పాటిస్తున్నాయి.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఆసుపత్రుల్లో సేవల కోసం 333 మంది వాలంటీర్ల ఎంపిక...

Mon Jul 20 , 2020
Post Views: 86 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని 111 కొవిడ్‌ ఆసుపత్రుల్లో వాలంటీర్లుగా వ‌ర్క్ చేసేందుకు 333 మందిని వైద్య, ఆరోగ్యశాఖ ప్రాథమికంగా ఎంపిక చేసింది. జాబ్స్ కోసం దాదాపు 10 వేల మంది అప్లై చేసుకున్నారు. వారి అర్హతలు, అనుభవం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మొద‌టి విడ‌త‌లో వీరిని ఆరోగ్య […]
November 2020
M T W T F S S
« Jul    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30