ట్రైనీ ఐఏఎస్‌లతో సీఎం…

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు సోమవారం క్యాంపు కార్యలయంలో భేటీ అయ్యారు. ముస్సోరీలో రెండో విడత శిక్షణ కరోనా కారణంగా నెల రోజుల పాటు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ట్రైనీ ఐఏఎస్‌లకు వివిధ శాఖలను కేటాయించారు. ఆయా శాఖల్లో అంశాలను, విధానాలను తెలుసుకునేందుకు ఈ కాలాన్ని ట్రైనీ ఐఏఎస్‌లు వినియోగించుకున్నారు. ఆ శాఖలపై ప్రజంటేషన్లు తయారు చేశారు.కొన్ని ఎంపిక చేసిన వాటిపై ట్రైనీ ఐఏఎస్‌లు సీఎంకు ప్రజెంటేషన్‌ అందజేశారు. ప్రజంటేషన్లు ఇచ్చిన ట్రైనీ ఐఏఎస్‌లు కేటన్‌ గార్గ్, విదేఖరే, ప్రతిస్థలను సీఎం అభినందించారు. వారిని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, ‘కేటాయించిన శాఖల్లో అవగాహన పెంచుకోవాలి. అనుభవం సంపాదించాలి. ప్రతి వ్యవస్థల్లో లోపాలు కనిపిస్తుంటాయి, వాటిని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ముందడుగులు వేసి వాటిని దృఢంగా తీర్చిద్దాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వంలో అనుభవజ్ఞులైన అధికారులు ఉన్నారు, వారి మార్గ నిర్దేశంలో పనిచేయాలి’ అని అన్నారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రెండో విడత బకాయిలు....

Tue Jun 30 , 2020
Post Views: 83 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email కరోనా విపత్తు సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.1,168 కోట్లతో రీస్టార్ట్‌ ప్యాకేజీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత రాయితీ బకాయిలను సోమవారం విడుదల చేసింది. రిస్టార్ట్‌ ప్యాకేజీలో భాగంగా మే నెలలో రూ.450 కోట్లను మే నెలలో విడుదల చేయగా, […]
jagan
January 2021
M T W T F S S
« Jul    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031