ఏపీలో కొత్తగా 1322 కరోనా పాజిటివ్ కేసులు…

 ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20వేలు దాటింది. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా 1322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,019కి చేరింది. కరోనాతో మరో ఏడుగురు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 239కి చేరుకుంది. ఇవాళ నమోదైన కేసుల్లో  1263 మంది స్థానికులకు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 56 మందికి, ఇతర దేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా సోకినట్లు వెల్లడించారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఇడుపులపాయకు వైఎస్‌ జగన్‌...

Wed Jul 8 , 2020
Post Views: 27 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email దివంగత నేత,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  కడపకు బయలు దేరారు. ఇడుపులపాయలో తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్మారకం చోట బుధవారం నివాళులు అర్పించిన అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ‌ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ […]
JAGAN
August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31