అవకాశం ఇవ్వాలని విజ్ఙప్తి…

సీఎం జగన్‌కు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఈశ్వరరావు లేఖ రాశారు. రాష్ట్ర రవాణా రంగం సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో లాక్‌డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన లేఖలో పేర్కొన్నారు. దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి నుంచి వినియోగదారులు వరకు ఉన్న సప్లై పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. మార్కెట్లో గిట్టుబాటు కాక ఇబ్బందులు పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల డీజిల్‌పై 11 రూపాయల వరకు పెంచిందన్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో పన్ను చెల్లింపునకు తమ అభ్యర్థన మేరకు అదనంగా రెండు నెలల పాటు గడువు ఇచ్చారని తెలిపారు. తమరు ఇచ్చిన వెసులుబాటులో కూడా చెల్లించలేని దుర్భర స్థితిలో చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పేదలకు స్థలాలు ఇస్తాం...

Tue Jul 7 , 2020
Post Views: 96 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ప్రజా  అభ్యున్నతి సంక్షేమమే  లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని…ఇది ప్రజల ప్రభుత్వం అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సోమవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రూ.12 కోట్లకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం లాగా శంకుస్థాపనతో సరి పెట్టకుండా పనులు పూర్తి చేసి.. ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. సీవీఆర్ స్కూల్ కాంపౌడ్‌లో కోటిన్నరతో నిర్మించే భవనం, రూ.90 లక్షలతో నిర్మించే లెనిన్ పార్కు అభివృద్ధి పనులకు, రూ.పది కోట్లతో సింగ్‌నగర్‌లో డంప్ యార్డ్‌లో పార్కు నిర్మాణాలకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఏడాది కాలంలో అన్ని వసతులతో ఇక్కడ పార్క్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.సింగ్‌నగర్‌లో ఉన్న ఇళ్లల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి రాజకీయ దురుద్దేశం తప్ప.. ప్రజల శ్రేయస్సు పట్టదని విమర్శించారు. నాడు వైఎస్, నేడు  జగన్ పేదలకు ఇళ్లు ఉండాలని భావించారని… అందుకే ప్రతి పేదవానికి   సెంటు స్థలం చొప్పున 30 లక్షల మందికి కేటాయించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ప్రభుత్వ స్థలం లేకపోయినా.. ప్రైవేట్ స్థలం కొని మరీ కేటాయించామన్నారు. టీడీపీ సాంకేతిక అంశాలను చూపి కోర్టుకు వెళ్లి పేదల ఇళ్లను అడ్డుకున్నారని మంత్రి ఆరోపించారు. టీడీపీ దుర్బుద్ధిని ప్రజలు కూడా అర్ధం చేసుకోవాలన్నారు.
JAGAN
March 2021
M T W T F S S
« Jul    
1234567
891011121314
15161718192021
22232425262728
293031