జగన్‌పై ఎమ్మెల్యేల ప్రశంసలు

సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌’ (ఆప్కాస్‌)ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, టీజేఆర్ సుధాకర్ బాబు పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి‌పై ప్రశంసలు కురిపించారు. పాదయాత్రలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధలు, కష్టాలు తెలుసుకున్న వైఎస్‌ జగన్ వారి కష్టాలు తీర్చడానికి ఆప్కాస్ ఏర్పాటు చేశారని అన్నారు. చంద్రబాబు పాలనలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు లంచాలు ఇచ్చి ఇబ్బందులు పడేవారని జోగి రమేష్ గుర్తు చేశారు. ఉద్యోగంలో చేరినా జీతాలు సమయానికి రాక తీవ్ర తీవ్ర కష్టాలు పడ్డారని తెలిపారు. టీడీపీ హయాంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు వందల కోట్ల రూపాయలు తీనేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం అవకాశం కల్పించే విధంగా సీఎం నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు. అందులోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారని వెల్లడించారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

జగన్‌ను అభినందించిన పవన్‌...

Sat Jul 4 , 2020
Post Views: 38 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌‌ శుక్రవారం అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో అత్యవసర సేవలందించే 108,104 వాహనాలను అత్యాధునిక సౌకర్యాలతో జూలై 1న 1088 అంబులెన్స్‌ సర్వీసులను సీఎం వైఎస్‌ జగన్ ఒకేసారి‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను […]
August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31