ఒంగోలు రంగాభవన్ లో దళితులపై దాడులపై టీడీపీ ఆద్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని హర్షకుమార్ విమర్శించారు. రాజమండ్రి, చీరాలలో జరిగిన ఘటనలు రాష్ట్రంలోని పరిస్థితులపై ఆందోళన కలిగిస్తున్నాయని, చీరాలలో మృతి చెందిన కిరణ్ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించి బాధ్యుడైన ఎస్ఐని సస్పెండ్ చేయాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. అప్పుడే మేం సీఎం జగన్ ను హర్షిస్తామని, చీరాల ఘటనకు బాధ్యుడైన ఎస్ఐ విజయ్ కుమార్ మోపిదేవి వెంకటరమణ అనుచరుడని, అందుకే అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని హర్షకుమార్ ఆరోపించారు.టీడీపీ హయాంలో ఇబ్బందులు పడ్డామనే ఉద్దేశ్యంతో 95 శాతం మంది దళితులు వైసీపీకి ఓట్లు వేసి పట్టం కట్టారని, సీఎం జగన్ పోలీసులకు రహస్యంగా తాఖీదులు ఇచ్చి దళితులను అణిచివేయమని చెప్పినట్లు అర్ధమవుతుందని హర్షకుమార్ అన్నారు. డాక్టర్లను అందరు దేవుడుగా భావిస్తుంటే సీఎం జగన్ మాత్రం పశువుల్లాగా చూస్తున్నారని, డాక్టర్ సుధాకర్ బాబు, డాక్టర్ అనితారాణి, లాయర్ రామకృష్ణ, వైసీపీ దళిత నాయకుడు రత్నకుమార్ లపై జరిగిన దాడులు, దళితులపై సీఎం జగన్ తీరుకు అద్దం పడుతున్నాయని విమర్శించారు.
Next Post
ఇసుకపై ఏపీ ప్రజలకు గుడ్న్యూస్...జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం..!
Mon Jul 27 , 2020
Post Views: 179 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ఇసుకకు సంబంధించి జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంటోంది. ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకున్న తరువాత.. నాణ్యమైనది సరఫరా అవ్వకపోతే దాన్ని వెనక్కి పంపే అవకాశాన్ని కొనుగోలుదారులకు ఇవ్వనున్నారు. అలాగే మళ్లీ వారికి నాణ్యమైన ఇసుక అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఏపీఎండీసీ ప్రతిపాదన […]

You May Like
-
1 year ago
నిజాయతీపరుడ్ని సస్పెండ్ చేస్తారా?
-
1 year ago
అసలు పెట్టుబడులే రాకుండా చేస్తున్నారు…
-
1 year ago
అవినీతి నిర్మూలనపై సీఎం..
-
1 year ago
లబ్ధిదారుల ఖాతాల్లో రూ.5వేలు వేసిన జగన్….