గత ప్రభుత్వంలో ఉన్న తప్పొప్పులు సరిదిద్ది స్థిరమైన పాలన చేసే అవకాశం ఉన్నప్పుడు.. దానిని సద్వినియోగం చేసుకోకుండా రాజకీయ కక్ష సాధింపుల కోసం పాలన చేస్తున్నారని జగన్ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు 62 కేసుల్లో తీర్పులు వచ్చాయని గుర్తుచేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు.. ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడిపిస్తుంటే ఆ పార్టీ కార్యకర్తల్లాగే ప్రవర్తిస్తుంటే కోర్టులు చూస్తూ ఎలా ఊరుకుంటాయని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడంలేదని సీఎం జగన్ మరోసారి ప్రకటించాలన్నారు. గురువారం ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. వివిధ అంశాలపై మాట్లాడారు. ఇన్ని కేసుల్లో హైకోర్టు నుంచి ఆక్షేపణలు ఎదుర్కోవడం గురించి ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని, చేసే పనుల్లో తప్పులున్నాయని అర్థం చేసుకోవాలన్నారు. విధానాలను సరి చేసుకోకపోతే ప్రజాగ్రహానికి గురి కాకతప్పదని హెచ్చరించారు. రాజకీయ వ్యవస్థ చేసే తప్పులకు అధికారులు బలైపోతున్నారని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో డీజీపీ ఇన్నిసార్లు హైకోర్టుకు వెళ్లడం ఎప్పుడూ జరగలేదన్నారు. 151 సీట్లు సాధించి గట్టి స్థిరత్వం ఇచ్చే శక్తిని వైసీపీ పొందిందని, కానీ తన బలాన్ని రాజకీయ కక్షల కోసం ఉపయోగిస్తోందని మండిపడ్డారు. కేవలం కొన్ని వర్గాలకే పని చేస్తూ.. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.
Next Post
కీలక నిర్ణయం.. భూముల విలువ భారీగా పెంపు.!
Mon Jul 27 , 2020
Post Views: 120 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email రాష్ట్రంలోని భూముల మార్కెట్ విలువలను భారీగా పెంచేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైనట్లు కనిపిస్తోంది. పట్టణాలు, నగరాలలోని వ్యవసాయ భూములు, అపార్ట్మెంట్లు, ఖాళీ స్థలాల విలువను ఆగష్టు 1 నుంచి పెంచనుంది. ఆయా ప్రాంతాల డిమాండ్లను బట్టి 5 నుంచి 50 శాతం వరకు ధరలు పెరిగే అవకాశాలు […]

You May Like
-
1 year ago
‘మతి భ్రమించే చంద్రబాబు అలా చేస్తున్నారు’
-
6 months ago
కోవిడ్ మరణాలు తగ్గించేందుకు.. జగన్ సర్కార్
-
1 year ago
YSRCP Jaggayyapeta MLA Udayabhanu Samineni
-
1 year ago
YSRCP Bapatla MLA Kona Raghupathi