కరోనా నివారణ చర్యలలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతోన్న కోవిడ్ మరణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వాటిని తగ్గించేందుకు రెమ్డెసివిర్, టోసీలిజుమబ్ లాంటి యాంటీ వైరల్ డ్రగ్లను పెద్ద మొత్తంలో ఆసుపత్రుల్లో అందుబాటులో తీసుకురావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.దీనితో తొలిదశలో హెటిరో కంపెనీ నుంచి దాదాపు 20 వేల డోసుల రెమ్డెసివిర్ మందును ఆర్డర్ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న ఆసుపత్రులకు 5 వేల డోసులు చేరుకోగా.. మరో 15 వేల డోసులు ఇవాళ చేరుకోనున్నాయి. అటు ఆగష్టు చివరి వారానికి ఇంకో 70 వేలకు పైగా డోసులను సిద్దంగా ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విషమ పరిస్థితుల్లో ఉన్న 15 వేల మందికి ఈ మందులు సరిపోతాయని వైద్యులు అంచనా వేశారు. కాగా, కరోనా రోగులకు మెరుగైన చికిత్స, సౌకర్యాలు అందించడంలో ఎక్కడా రాజీపడకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు.
Next Post
జగన్ ప్రభాత్వం పై పవన్...
Sun Jul 26 , 2020
Post Views: 185 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email గత ప్రభుత్వంలో ఉన్న తప్పొప్పులు సరిదిద్ది స్థిరమైన పాలన చేసే అవకాశం ఉన్నప్పుడు.. దానిని సద్వినియోగం చేసుకోకుండా రాజకీయ కక్ష సాధింపుల కోసం పాలన చేస్తున్నారని జగన్ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు 62 కేసుల్లో తీర్పులు వచ్చాయని గుర్తుచేశారు. […]

You May Like
-
7 months ago
లక్ష దాటిన కరోనా కేసులు…
-
1 year ago
YSRCP Gudivada MLA Kodali Nani
-
9 months ago
వైసీపీలో పెను మంటలు…
-
1 year ago
దసరా ఉత్సవాలకు ఆహ్వానం అందుకున్న సీఎం జగన్
-
9 months ago
వ్యవసాయ బడ్జెట్ కూర్పుపై సీఎం…