బీసీల సంక్షేమం, అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది…

బీసీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కృషిని చూసి వారంతా ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉన్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకర్‌ నారాయణ అన్నారు. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే బీసీల సంక్షేమం, అభ్యున్నతి కోసం సీఎం పనిచేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పాలనలో బీసీలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయం, వారి కష్టాలు తెలుసుకునేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యయన కమిటీని వేశారన్నారు. సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్, బీసీ ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి శంకర్‌ నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ వర్కుల్లో, మహిళలకు పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ కల్పించారు.   
– స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసింది. కేబినెట్‌లో కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఏపీలో ‘ఆపరేషన్ ముస్కాన్’ సక్సెస్.. వేలాది మంది వీధి బాలలకు విముక్తి..

Thu Jul 23 , 2020
Post Views: 76 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం వీధి బాలల కోసం ‘ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్‌ 19’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ శాఖల సమన్వయంతో పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని ద్వారా తప్పిపోయిన బాలబాలికలు, బాల కార్మికులు, అనాథ పిల్లలను […]
jagan
November 2020
M T W T F S S
« Jul    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30