జగన్‌కు జనసేనాని సలహా…

యావత్ ప్రపంచం కరోనాతో వణికిపోతున్న తరుణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ ప్రభుత్వానికి చురకలంటిస్తూనే సలహాలతో తెరమీదికి వచ్చారు. కరోనా యావత్ ప్రపంచానికి వచ్చిన ఉపద్రవమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దానికి ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా వుండాలని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు జనసేనాని.‘‘ టెస్టులు ఎక్కువగా చేస్తున్నాం అంటున్నారు… మరి ఆసుపత్రుల్లో రోగులకందించే సేవలపై శ్రద్ధ ఏది? ’’ అని ప్రశ్నించిన జనసేన పార్టీ అధినేత.. ‘‘ ఆక్సిజన్ కొరత… నాణ్యత లేని ఆహారం… వెంటిలేటర్లు, బెడ్స్ సమస్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి ’’ అంటూ సలహా ఇచ్చారు. గృహ నిర్మాణం, ఇళ్ల పట్టాల సమస్యలపై బీజేపీతో కలసి పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు బాసటగా నిలుస్తామని తెలిపారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

'బాలినేని సవాల్‌ను స్వీకరించే దమ్ము టీడీపీకి లేదు'

Wed Jul 22 , 2020
Post Views: 90 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని టీడీపీ నేతలు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్‌ యాదవ్‌ అన్నారు. ఏడాది పాలనపై ఆరోపించడానికి ఏమీ లేక మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై టీడీపీ నేతలు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడో […]
JAGAN
November 2020
M T W T F S S
« Jul    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30