బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్యాస్ట్‌ కాదు…

బీసీల అభ్యునతికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయం, వారి కష్టాలు తెలుసుకునేందుకు సీఎం జగన్‌ అధ్యయన కమిటీ వేశారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ వర్కుల్లో, మహిళల పదవుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం బీసీలకు పెద్ద పీఠ వేసింది. క్యాబినెట్‌లో కూడా బీసీలకు పెద్ద పీఠ వేశారు. బీసీల కోసం 28 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బీసీలకు నేడు పండుగ రోజు. అందులో భాగంగా 30వేల జనాభా మించిన కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మెన్ , డైరెక్టర్లను నియమిస్తారు. గత ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంది. అందుకే బీసీలు గత ఎన్నికల్లో టీడీపీకి బుద్ది చెప్పారు. బీసీలంతా వైఎస్ జగన్‌ వెంట ఉన్నారు. ఆయనకు బీసీలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని శంకర నారాయణ తెలిపారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

వైసీపీ యువనేత బర్త్ డే పార్టీ..

Tue Jul 21 , 2020
Post Views: 81 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email కరోనాను నివారించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవిరాళంగా కృషి చేస్తున్నాయి. అయితే ప్రభుత్వాల నిర్ణయాలను, ఆదేశాలను రాజకీయపార్టీల నేతలు తుంగలో తొక్కేస్తున్నారు. బర్త్ డే పార్టీలతో పాటు రాజకీయ కార్యక్రమాల్లో కరోనా నివారణ చర్యలను ఖాతరు చేయడం లేదు. కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో […]
November 2020
M T W T F S S
« Jul    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30