వైసీపీ యువనేత బర్త్ డే పార్టీ..

కరోనాను నివారించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవిరాళంగా కృషి చేస్తున్నాయి. అయితే ప్రభుత్వాల నిర్ణయాలను, ఆదేశాలను రాజకీయపార్టీల నేతలు తుంగలో తొక్కేస్తున్నారు. బర్త్ డే పార్టీలతో పాటు రాజకీయ కార్యక్రమాల్లో కరోనా నివారణ చర్యలను ఖాతరు చేయడం లేదు. కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో పుట్టినరోజు వేడుకలను అధికార పార్టీ నేతలే నిర్వహించడం గమనార్హం. అటు టీఆర్‌ఎస్ నేతలు, ఇటు వైసీపీ నేతలు ఘనంగా వేడుకలను నిర్వహిస్తూ.. చిక్కులు తెచ్చిపెడుతున్నారు. దాని ఫలితం సామాన్య ప్రజలపై పడుతోంది.ఏపీలో అధికార పార్టీకి చెందిన ఓ నేత పుట్టినరోజు వేడుకను ఆయన అనుచరులు ఘనంగా నిర్వహించారు. అదెక్కడో కాదు కరోనా హాట్‌స్పాట్ అయిన తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించారు. జిల్లాలోని రావులపాలెం మండలం ఊబలంక బర్త్ డే పార్టీలో కరోనా కలకలం రేగింది. ఊబలంక గ్రామంలో వైసీపీ యువనేత  బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా జరిపారు. పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న పలువురు అనారోగ్యానికి గురయ్యారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

సంతోషంగా బీసీలు...

Wed Jul 22 , 2020
Post Views: 93 Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email బీసీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కృషిని చూసి వారంతా ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉన్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకర్‌ నారాయణ అన్నారు. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే బీసీల సంక్షేమం, అభ్యున్నతి కోసం సీఎం పనిచేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు […]
JAGAN
November 2020
M T W T F S S
« Jul    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30