కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో కరోనా వైద్య పరీక్షల నిర్వహణపై ఏపీ భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాపిడ్‌ ఆంటీజన్ టెస్టులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది. ఐసీఎంఆర్‌ అనుమతించిన ల్యాబ్‌లలో కోవిడ్ టెస్టులు జరపాలని, ర్యాపిడ్‌ ఆంటీజన్‌ టెస్టుకి రూ.750 మించి వసూలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఆ నమూనాని […]

ఏ రోజుకారోజు రికార్డులను కరోనా అధిగమిస్తూ వస్తోంది. సోమవారం నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తర్వాత లక్ష కేసులు నమోదు చేసిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. ఈ రోజు 43,127 మందికి కరోనా టెస్టులు చేశారు. ఈ టెస్టుల్లో 6,051 మంది కొవిడ్- 19 పాజిటివ్ నిర్ధారించారు. ఈ కేసులతో కలిపి 1,02,349కి కరోనా కేసులు చేరాయి. […]

ఇసుకకు సంబంధించి జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంటోంది. ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకున్న తరువాత.. నాణ్యమైనది సరఫరా అవ్వకపోతే దాన్ని వెనక్కి పంపే అవకాశాన్ని కొనుగోలుదారులకు ఇవ్వనున్నారు. అలాగే మళ్లీ వారికి నాణ్యమైన ఇసుక అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఏపీఎండీసీ ప్రతిపాదన సిద్ధం చేస్తుండగా.. దీనిపై ఏపీ ప్రభుత్వం త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది. కాగా ఇంటికి డెలివరీ చేసిన ఇసుక నాణ్యత లేదని, మట్టితో […]

ఒంగోలు రంగాభవన్ లో దళితులపై దాడులపై టీడీపీ ఆద్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని హర్షకుమార్ విమర్శించారు. రాజమండ్రి, చీరాలలో జరిగిన ఘటనలు రాష్ట్రంలోని పరిస్థితులపై ఆందోళన కలిగిస్తున్నాయని, చీరాలలో మృతి చెందిన కిరణ్ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించి బాధ్యుడైన ఎస్ఐని సస్పెండ్ చేయాలని […]

రాష్ట్రంలోని భూముల మార్కెట్ విలువలను భారీగా పెంచేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైనట్లు కనిపిస్తోంది. పట్టణాలు, నగరాలలోని వ్యవసాయ భూములు, అపార్ట్‌మెంట్లు, ఖాళీ స్థలాల విలువను ఆగష్టు 1 నుంచి పెంచనుంది. ఆయా ప్రాంతాల డిమాండ్లను బట్టి 5 నుంచి 50 శాతం వరకు ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు లేదా మూడు రోజుల్లో దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోతే.. […]

గత ప్రభుత్వంలో ఉన్న తప్పొప్పులు సరిదిద్ది స్థిరమైన పాలన చేసే అవకాశం ఉన్నప్పుడు.. దానిని సద్వినియోగం చేసుకోకుండా రాజకీయ కక్ష సాధింపుల కోసం పాలన చేస్తున్నారని జగన్‌ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు 62 కేసుల్లో తీర్పులు వచ్చాయని గుర్తుచేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు.. ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడిపిస్తుంటే ఆ పార్టీ కార్యకర్తల్లాగే ప్రవర్తిస్తుంటే కోర్టులు చూస్తూ ఎలా ఊరుకుంటాయని ప్రశ్నించారు. […]

కరోనా నివారణ చర్యలలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతోన్న కోవిడ్ మరణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వాటిని తగ్గించేందుకు రెమ్‌డెసివిర్, టోసీలిజుమబ్‌ లాంటి యాంటీ వైరల్‌ డ్రగ్‌లను పెద్ద మొత్తంలో ఆసుపత్రుల్లో అందుబాటులో తీసుకురావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.దీనితో తొలిదశలో హెటిరో కంపెనీ నుంచి దాదాపు 20 వేల డోసుల రెమ్‌డెసివిర్‌ మందును ఆర్డర్ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో […]

ఏపీ ప్ర‌భుత్వం రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో 13, నియోజకవర్గాల స్థాయిలో 147, ప్రాంతీయ స్థాయిలో 4 వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటుకు అనుమ‌తులు ల‌భించాయి. విశాఖ, గుంటూరు, ఏలూరు, తిరుపతి నగరాల్లో 4 ప్రాంతీయ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ల్యాబ్స్ ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల క్వాలిటీ ప‌రిశీలించ‌నున్నారు.ఇందుకు సంబంధించి రూ.197 కోట్లతో ప్రాజెక్టు […]

’రాష్ట్రంలో రూ.4వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌ను బలోపేతం చేస్తాం. ప్రతి రైతు భరోసా కేంద్రానికి అనుబంధంగా గోదాములు నిర్మిస్తాం. వీటిల్లో రూ.350 కోట్లతో గ్రేడింగ్‌ యూనిట్లు, సార్టింగ్‌ యంత్ర పరికరాలు అందుబాటులోకి తెస్తాం. ప్రతి మండలంలో కోల్డ్‌ స్టోరేజీ లేదా కోల్డ్‌ రూములు ఏర్పాటు చేస్తాం’ అని సీఎం జగన్‌ ప్రకటించారు. గురువారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో గోదాములు, శీతల గిడ్డంగుల ఏర్పాటుపై వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. […]

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గత వారం రోజులుగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు నగరాలు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. భారీ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. అలాగే కరోనా వస్తే ఏం చేయాలి.? ఎవరిని సంప్రదించాలి.? అనే అంశాలపై ప్రజలకు అవగాహన కలిగేలా విస్తృతంగా ప్రచారం చేయాలని.. […]

May 2021
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31