ఏ రోజుకారోజు రికార్డులను కరోనా అధిగమిస్తూ వస్తోంది. సోమవారం నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తర్వాత లక్ష కేసులు నమోదు చేసిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. ఈ రోజు 43,127 మందికి కరోనా టెస్టులు చేశారు. ఈ టెస్టుల్లో 6,051 మంది కొవిడ్- 19 పాజిటివ్ నిర్ధారించారు. ఈ కేసులతో కలిపి 1,02,349కి కరోనా కేసులు చేరాయి. […]

గత ప్రభుత్వంలో ఉన్న తప్పొప్పులు సరిదిద్ది స్థిరమైన పాలన చేసే అవకాశం ఉన్నప్పుడు.. దానిని సద్వినియోగం చేసుకోకుండా రాజకీయ కక్ష సాధింపుల కోసం పాలన చేస్తున్నారని జగన్‌ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు 62 కేసుల్లో తీర్పులు వచ్చాయని గుర్తుచేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు.. ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడిపిస్తుంటే ఆ పార్టీ కార్యకర్తల్లాగే ప్రవర్తిస్తుంటే కోర్టులు చూస్తూ ఎలా ఊరుకుంటాయని ప్రశ్నించారు. […]

ఆగస్టు 15న పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే.. టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారన్నారు. వారి వల్ల సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. కోర్టు కేసులకు సంబంధించి అడ్డంకులన్నీ తొలగిపోతే భారత స్వాతంత్ర దినోత్సవం రోజున 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని జగన్ స్పష్టంచేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో […]

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని టీడీపీ నేతలు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్‌ యాదవ్‌ అన్నారు. ఏడాది పాలనపై ఆరోపించడానికి ఏమీ లేక మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై టీడీపీ నేతలు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడో తమిళనాడులో కారులో నగదు దొరికితే దానిని మంత్రి బాలినేనికి అంటగట్టడం సిగ్గుచేటు. ఆ డబ్బుకు సంబంధించిన సదురు వ్యాపారి అది తమదేనని […]

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి లేఖ రాశారు. ఇప్పటికే పలు విషయాలపై జగన్‌కు లేఖలు రాసిన ఆయన తాజాగా.. రాష్ట్రంలోని గోశాల గురించి లేఖలో పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో గోశాల అభివృద్ధి కమీటీలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వైఎస్ సీఎంగా ఉన్న 2005లో గోశాల అభివృద్ధి కమీటీలు ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చారు. రాష్ట్ర పునర్విభజన జరిగిన తరువాత మళ్ళీ […]

కరోనాపై పోరులో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని ఇంద్ర బస్సులను కరోనా టెస్టింగ్ సెంటర్లుగా మారుస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నాయి. వాటికి ‘సంజీవని’ అనే నామకరణం చేశారు. వైరస్ ఉద్ధృతి బాగా పెరిగిపోతున్న నేపధ్యంలో గ్రామాల్లో ఎక్కువగా పరీక్షలు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ జిల్లాలకు ‘సంజీవని’ బస్సులను పంపిస్తోంది.ప్రతీ జిల్లాకు నాలుగు చొప్పున బస్సులను పంపిస్తుండగా.. ఒక్కో బస్సులో పది మంది […]

వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపును విస్తరిస్తూ సోమ‌వారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి‌ ఆదేశాలు జారీచేశారు. దీంతో గురువారం నుంచి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించ‌నుంది. సోమ‌వారం సీఎం జ‌గ‌న్ త‌న‌ క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ సీఈఓ డా.మల్లికార్జున్‌తో సమావేశమయ్యారు. ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుపై సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా వెంటనే […]

ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం రోజున సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, రెవిన్యూ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం రోజున పట్టాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు మేలు చేయాలని […]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. అన్యాయంగా చేసిన విభ‌జ‌న వ‌ల్ల పుట్టిన దుఖం నుంచి అమరావతి ఆవిర్భావం అయిందన్నారు. తెలుగువారిని ఏకం చేయ‌డానికి గొప్ప ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అమ‌రావ‌తి వేదిక‌ అని చంద్రబాబు అన్నారు. ధృడ‌‌ సంక‌ల్పం, మాన‌వ‌ వ‌న‌రులు.. ప్రజ‌ల్లోని నైపుణ్య శ‌క్తి క‌లిపి గొప్ప సెల్ఫ్ ఫైనాన్స్ రాజ‌ధాని అమ‌రావ‌తి అని చంద్రబాబు తెలిపారు. […]

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని జూలై 7, 8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లా పర్యటన ఖరారైంది. ఈ సందర్భంగా సీఎం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. హరికిరణ్‌ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ హరికిరణ్‌ జిల్లా అధికారులతో, ఎస్పీ అన్బురాజన్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్‌-19 నేపథ్యంలో స్టాండర్డ్‌ ఆపరేషనల్‌ […]

April 2021
M T W T F S S
« Jul    
 1234
567891011
12131415161718
19202122232425
2627282930