గత ప్రభుత్వంలో ఉన్న తప్పొప్పులు సరిదిద్ది స్థిరమైన పాలన చేసే అవకాశం ఉన్నప్పుడు.. దానిని సద్వినియోగం చేసుకోకుండా రాజకీయ కక్ష సాధింపుల కోసం పాలన చేస్తున్నారని జగన్‌ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు 62 కేసుల్లో తీర్పులు వచ్చాయని గుర్తుచేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు.. ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడిపిస్తుంటే ఆ పార్టీ కార్యకర్తల్లాగే ప్రవర్తిస్తుంటే కోర్టులు చూస్తూ ఎలా ఊరుకుంటాయని ప్రశ్నించారు. […]

ఏపీ ప్ర‌భుత్వం రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో 13, నియోజకవర్గాల స్థాయిలో 147, ప్రాంతీయ స్థాయిలో 4 వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటుకు అనుమ‌తులు ల‌భించాయి. విశాఖ, గుంటూరు, ఏలూరు, తిరుపతి నగరాల్లో 4 ప్రాంతీయ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ల్యాబ్స్ ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల క్వాలిటీ ప‌రిశీలించ‌నున్నారు.ఇందుకు సంబంధించి రూ.197 కోట్లతో ప్రాజెక్టు […]

’రాష్ట్రంలో రూ.4వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌ను బలోపేతం చేస్తాం. ప్రతి రైతు భరోసా కేంద్రానికి అనుబంధంగా గోదాములు నిర్మిస్తాం. వీటిల్లో రూ.350 కోట్లతో గ్రేడింగ్‌ యూనిట్లు, సార్టింగ్‌ యంత్ర పరికరాలు అందుబాటులోకి తెస్తాం. ప్రతి మండలంలో కోల్డ్‌ స్టోరేజీ లేదా కోల్డ్‌ రూములు ఏర్పాటు చేస్తాం’ అని సీఎం జగన్‌ ప్రకటించారు. గురువారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో గోదాములు, శీతల గిడ్డంగుల ఏర్పాటుపై వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. […]

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గత వారం రోజులుగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు నగరాలు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. భారీ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. అలాగే కరోనా వస్తే ఏం చేయాలి.? ఎవరిని సంప్రదించాలి.? అనే అంశాలపై ప్రజలకు అవగాహన కలిగేలా విస్తృతంగా ప్రచారం చేయాలని.. […]

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ పేర్లను నామినేట్‌ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తాము రుణపడి ఉంటామని అమలాపురం మాజీ ఎంపీ డాక్టర్‌ పండుల రవీంద్రబాబు, మైనార్టీ మహిళా నేత ఎం.జకియా ఖానమ్‌లు పేర్కొన్నారు. మంగళవారం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి రాగానే నేతలు తమ హామీలను మరిచిపోతుంటారు కానీ, సీఎం వైఎస్‌ జగన్‌ తనను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసి ఎన్నికల […]

ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు, ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ.. బీసీ వర్గానికి […]

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బియ్యం కార్డుదారులకు సోమవారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తోన్న‌ ఉచిత రేష‌న్ సరుకుల పంపిణీ జరగనుంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే గ్రామగ్రామ‌న ఉన్న రేష‌న్ కేంద్రాల‌కు స‌రుకులు చేరుకున్నాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ‌ ఉపాధి కోల్పోతున్న పేదలను ఆదుకునేందుకు సీఎం జ‌గ‌న్ ఆదేశాల మేరకు.. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇప్పటికే పేద‌ల‌కు ఏడు […]

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని 111 కొవిడ్‌ ఆసుపత్రుల్లో వాలంటీర్లుగా వ‌ర్క్ చేసేందుకు 333 మందిని వైద్య, ఆరోగ్యశాఖ ప్రాథమికంగా ఎంపిక చేసింది. జాబ్స్ కోసం దాదాపు 10 వేల మంది అప్లై చేసుకున్నారు. వారి అర్హతలు, అనుభవం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మొద‌టి విడ‌త‌లో వీరిని ఆరోగ్య శాఖ అధికారులు ఎంపిక చేశారు. వాలంటీర్లుగా సేవ‌లందించేందుకు ఆసక్తి ఉన్న వారు కొవిడ్‌ యాప్‌ ద్వారా లేదా covid-19info@ap.gov.in మెయిల్‌ ద్వారా […]

కరోనాపై పోరులో భాగంగా మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోన్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూ.8.50కోట్లతో రాష్ట్రంలో 1,500 పడకలతో భారీ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ని ఏర్పాటు చేస్తోంది. రాప్తాడు సమీపంలోని రామినేపల్లి వద్ద ఉన్న పౌర సరఫరాల సంస్థ గోదాము (వేర్‌హౌస్‌)లో దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మొత్తం 12 బ్లాక్‌లకు గాను రెండు బ్లాక్‌లు మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. కరోనా బాధితులకు […]

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,602 కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవి 2,592 కాగా.. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారిలో 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40,646కి చేరింది. వీటిల్లో 19,814 యాక్టివ్ కేసులు ఉండగా.. 20,298 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక […]

May 2021
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31