అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని వికేంద్రీకరణ చేస్తుంటే, టీడీపీ నేతలు జీర్జించుకోలేకపోతున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా రోడ్లపైకి రాని చంద్రబాబు కుటుంబం.. ఇప్పుడు వేల కోట్ల స్పప్నం తరలిపోతుందనే వేదనతో బయటకొస్తుందని విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 200 రోజుల నుంచి అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని, […]

రఘురామకృష్ణంరాజుకు సీఎం వైఎస్‌ జగన్‌ అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. టీటీడీ వివాదంపై చైర్మన్‌తో గానీ, ఈఓతోగానీ రఘురామకృష్ణంరాజు చర్చించనిదే… టీటీడీ భూముల అమ్మకాలు జరిగిపోయినట్లుగా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. ఆయన ఇచ్చిన వివరణలో నిజాయితీ లేదని ఎంపీ మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. రఘురామకృష్ణంరాజు కుంటిసాకులు మానుకోవాలని ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ చేశారు. రాబోయే ఉపఎన్నికల్లో […]

సీఎం జగన్‌ దుర్మార్గపు పాలన చేస్తున్నాడని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు దుయ్యబట్టారు. ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు దందాలు చేస్తున్నారని, భూముల్ని కబ్జా చేసి కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. వినుకొండలో ఇళ్ల స్థలాల పేరుతో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. నివాసయోగ్యంకాని భూముల్ని పేదలకు కట్టబెడుతున్నారని, అధికారులు వైసీపీ నేతల చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆనందబాబు ధ్వజమెత్తారు.

సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధ్యాప్య ఫించన్ వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60కి తగ్గిస్తూ అవ్వాతాతల పథకానికి జీవో ఇచ్చారని తెలిపారు. 2019 జులై నుంచి అమల్లోకి వస్తుందని ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నారని, దీనివల్ల లబ్దిదారులు 7 నెలల కాలానికి రూ.15,750 నష్టపోయారని పేర్కొన్నారు. లబ్దిదారులకు ఆ మొత్తం అందేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు. […]

కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగం తలకిందులైన తరుణంలోనూ ప్రజలకిచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చుకుంటూ పోతున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఏడాదిలోపే ఆర్యవైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడమేగాక రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్‌ అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన […]

July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031