ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. అన్యాయంగా చేసిన విభ‌జ‌న వ‌ల్ల పుట్టిన దుఖం నుంచి అమరావతి ఆవిర్భావం అయిందన్నారు. తెలుగువారిని ఏకం చేయ‌డానికి గొప్ప ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అమ‌రావ‌తి వేదిక‌ అని చంద్రబాబు అన్నారు. ధృడ‌‌ సంక‌ల్పం, మాన‌వ‌ వ‌న‌రులు.. ప్రజ‌ల్లోని నైపుణ్య శ‌క్తి క‌లిపి గొప్ప సెల్ఫ్ ఫైనాన్స్ రాజ‌ధాని అమ‌రావ‌తి అని చంద్రబాబు తెలిపారు. […]

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని జూలై 7, 8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లా పర్యటన ఖరారైంది. ఈ సందర్భంగా సీఎం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. హరికిరణ్‌ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ హరికిరణ్‌ జిల్లా అధికారులతో, ఎస్పీ అన్బురాజన్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్‌-19 నేపథ్యంలో స్టాండర్డ్‌ ఆపరేషనల్‌ […]

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌‌ శుక్రవారం అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో అత్యవసర సేవలందించే 108,104 వాహనాలను అత్యాధునిక సౌకర్యాలతో జూలై 1న 1088 అంబులెన్స్‌ సర్వీసులను సీఎం వైఎస్‌ జగన్ ఒకేసారి‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను అభినందిస్తూ పవన్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్యా అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌లను అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం అభినందనీయం. […]

సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌’ (ఆప్కాస్‌)ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, టీజేఆర్ సుధాకర్ బాబు పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి‌పై ప్రశంసలు కురిపించారు. పాదయాత్రలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధలు, కష్టాలు తెలుసుకున్న వైఎస్‌ జగన్ వారి కష్టాలు తీర్చడానికి ఆప్కాస్ ఏర్పాటు […]

స‌హ‌కార రంగంలోని చ‌క్కెర ఫ్యాక్ట‌రీల పున‌రుద్ధ‌ర‌ణ‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం స‌మీక్షా నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ పాల్గొన్నారు. రైతుల‌కు చెల్లించాల్సిన బ‌కాయిల వివ‌రాలు ఆరా తీసిన సీఎం.. వారికి ఒక్క రూపాయి కూడా బ‌కాయిలు లేకుండా తీర్చాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ మేర‌కు ఈనెల 8న […]

July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031